తలలు కలిసి పుట్టిన సౌదీ కవలలను వేరుచేసిన శస్త్రచికిత్స
- October 14, 2016
రియాద్: సౌదీలో తలలు కలిసి పుట్టిన కవలలకు గురువారం విజయవంతంగా డాక్టర్ అబ్దుల్లా అల్ రబీఆహ్ నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిపేరు. బహుళ విభాగ జట్టు ఐదు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా వారిని వేరుచేశారు.
విభజన కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీలో కింగ్ అబ్దుల్లా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వద్ద జరిగింది, రియాద్ నేషనల్ గార్డ్ - ఆరోగ్యం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జారీ చేసిన ఒక ఆదేశం ఆధారంగా ఈ శస్త్రచికిత్స జరిగింది. కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ-రియాద్ వద్ద ఒక సిజేరియన్ విభాగంలో వారి తల్లి గర్భం ధరించిన 34 వ వారంలో ఉన్నప్పుడు తలలు కలిసి పుట్టిన ఈ కవలలు ఎలీన్ మరియు ఐలం లు జన్మించారు. పుట్టినపుడు వారు 3.6 కిలోల బరువు కల్గి ఉన్నారు. ఆసుపత్రి ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ఈ శస్త్రచికిత్స ఉదయం 7:20 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి విజయవంతంగా ముగిసింది, ఈ కవలలను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో రెండు ప్రత్యేక మంచాలపై ఈ ఇద్దరు చిన్నారులను వేర్వేరుగా ఉంచారు.ఈ కవలలకు వైద్య పరీక్షల అనంతరం వారికి ఉదర గోడ మరియు చాతీ దిగువ భాగంలో ఇరువురి శరీరాలు అతుక్కొని వున్నట్లు వైద్యులు గుర్తించారు. .మరియు వారు కాలేయం ఉదరం పంచుకొంటూ జీవిస్తున్నట్లు అల్ రబీఆహ్ ఆసుపత్రివర్గాలు పేర్కొన్నారు. ఈ జంటలో ఐలం అసాధారణతలు బాధపడగా ఆమె ఉదర గోడకు అంతరాయం మూత్రాశయం, మరియు చిన్న ప్రేగు మరియు పిత్తాశయమును మధ్య నెలకొని ఉన్న ఆజన్మ లోపాలతో సతమవుతుండగా,ఎలీన్ సైతం వెన్నెముక, మరియు మెదడు సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతుండేది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







