గూగుల్ ఫాక్ట్ చెక్ తో ఇక ఫేక్ న్యూస్ ఆట కట్టు
- October 15, 2016
ఫేక్న్యూస్కి గూగుల్ సెర్చింజన్ చెక్ పెట్టనుంది. ఇందుకు సంబంధించి ఓ సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేసింది. దీంతో రీడర్స్ తాము చదివే న్యూస్ ఐటెమ్స్‌లో ఏది నిజం, ఏది నకిలి అనేది సులువుగా పట్టేయవచ్చు. అదీ కేవలం హెడ్‌లైన్స్ వద్దనే ఆ విషయం తెలుస్తుంది. లోతుల్లోకి వెళ్తే.. ఇవాళ రేపు సొషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయి. ఏది నిజమో, ఏది తప్పుడు వార్తో తెలియక చాలామందికి బోలెడంత కన్ఫ్యూజన్. ఒక్కోసారి తప్పుడు వార్తలు ప్రజల్ని పక్కదోవ పట్టించిన సందర్భాలు లేకపోలేదు. అందుకు ఎగ్జాంపుల్. రీసెంట్గా ఫాక్స్ న్యూస్‌లో ఓ వార్త వివరీతంగా ట్రెండ్ అయి, చివరకు కాంట్రవర్సీకి దారితీసింది.
చివరకు ఫాల్స్ న్యూస్‌గా తేలింది. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గురించి తప్పుడు కథనాలు చాలానే ట్రెండ్ అయ్యాయట. అందులో 71శాతం న్యూస్ తప్పుగా తేలింది కూడా. ఇటువంటి ప్రమాదాల్ని తప్పించడానికే గూగుల్ మహాతల్లి సొల్యూషన్ కనిపెట్టింది.
ఫాక్ట్ చెక్ పేరుతో తాము యాడ్ చేసిన ఈ కొత్త ట్యాగ్‌ని వాడితే నకిలీ వార్తలేంటో ఈజీగా కనిపెట్టేయవచ్చన్నది గూగుల్ చెబుతున్నమాట. ఇప్పుడిప్పుడే అమెరికా, యూకె దేశాల్లో దీన్ని ప్రవేశపెట్టింది. రేపోమాపో ఇండియాలో ఎంట్రీ ఇవ్వవచ్చు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







