రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ భేటీ
- October 15, 2016
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు పుతిన్ నేడు గోవా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అణు విద్యుత్, రక్షణ ఒప్పందాలు లాంటి పలు ప్రతిపాదనలపై ఇరువురు చర్చించనున్నారు. తమిళనాడులోని కుడంకుళంలో మరో రెండు రియాక్టర్ల ఏర్పాటుపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భారత్ నేతృత్వంలో గోవా వేదికగా ఎనిమిదో బ్రిక్స్ వార్షిక సదస్సు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







