23 శాతం మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌

- October 15, 2016 , by Maagulf
23 శాతం మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌

ముందుగానే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని గుర్తిస్తే, తగిన వైద్య చికిత్స అందించడం ద్వారా పూర్తిస్థాయిలో క్యాన్సర్‌ని నయం చేసేందుకు అవకాశం ఉంటుందని వైద్యాధికారులు చెప్పారు. కువైట్‌లో 23 శాతం మంది మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయని వారు తెలిపారు. కువైట్‌ క్యాన్సర్‌ కంట్రోల్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఖులూద్‌ అల్‌ అలి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నట్లు చెప్పారు. మమ్మోగ్రఫీ ద్వారా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తించవచ్చని ఆమె వివరించారు. 2013లో నిర్వహించిన పరీక్షల్లో 100 మందికిగాను 57 మందికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలిందనీ, సగటున 54 శాతం మందికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని గుర్తించామనీ, ఇందులో 12 శాతం మహిళలు 40 ఏళ్ళ వయసు లోపు ఉన్నట్లు తెలిపారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రికవరీ రేట్‌ 80 శాతం పైగానే ఉన్నందున, ముందస్తుగా గుర్తించడమే ముఖ్యమన్న విషయం అందరూ గుర్తించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com