చేపల మృతిపై విచారణ

- October 15, 2016 , by Maagulf
చేపల మృతిపై విచారణ

 జెడ్డా: పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందిన ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వ శాఖలు, చేపల మృతికి కారణాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నీటిలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గడమే పెద్ద సంఖ్యలో ఒకేసారి చేపలు మృతి చెందడానికి కారణంగా అనుమానిస్తున్నారు అధికారులు. మృతి చెందిన చేపల్లో కొన్నింటిని సేకరించి, వాటిని పరీక్షలకు పంపారు. జనరల్‌ అథారిటీ ఫర్‌ మెటియరాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటక్షన్‌ అండ్‌ ఫిషరీస్‌, మరియు మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సంయుక్తంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి, చేపల మృతికి గల కారణాల్ని అన్వేషించనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో చెల్లను ఇష్టమొచ్చినట్లుగా పడేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందనీ, అది కూడా చేపల మరణానికి కారణం కావొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో వైపున చనిపోయిన చేపల్ని మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. జెడ్డా కోర్నిచ్‌ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందనీ, కాలుష్యం పెరిగిపోవడం వల్ల సముద్ర జీవులకు కష్టాలు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com