మానవసహిత రోదసి యాత్ర : చైనా

- October 17, 2016 , by Maagulf
మానవసహిత రోదసి యాత్ర : చైనా

 చైనా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ మానవసహిత అంతరిక్ష యాత్ర సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. చైనా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇద్దరు వ్యోమగాములతో షెంజౌ-11 అనే వ్యోమనౌన రోదసిలోకి దూసుకెళ్లింది. జియుక్వాన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు.
ఈ నౌకలో జింగ్‌ హైపెంగ్‌.. షెన్‌ డాంగ్‌ అనే ఇద్దరు వ్యోమగాములు కక్ష్యలోకి పయనమయ్యారు. లాంగ్‌ మార్చ్‌ 2ఎఫ్‌ అనే రాకెట్‌ ద్వారా ఈ వ్యోమనౌక నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశించింది. రెండు రోజుల్లో వీరు రోదసిలోని చైనా ప్రయోగాత్మక అంతరిక్ష కేంద్రానికి చేరుకుని..
నెల రోజులు అక్కడే బస చేస్తారు. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చిన తర్వాతి రోజు షెంజౌ-11 వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణం కానుంది. ప్రయోగానికి ముందు వ్యోమగాములు మీడియాతో మాట్లాడారు. ఈ మిషన్‌కు జింగ్‌ హైపెంగ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.అంతరిక్షంలోకి వెళ్లడం జింగ్‌కు ఇది మూడోసారి. 2008లో షెంజౌ-7 మిషన్‌, 2012లో షెంజౌ-9 మిషన్‌లో జింగ్‌ రోదసిలో వెళ్లివచ్చారు. 2003లో చైనా తొలిసారిగా మానవసహిత అంతరిక్ష ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ఇప్పుడీ సుదీర్ఘ మానవసహిత రోదసి యాత్రను చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com