పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణo

- October 17, 2016 , by Maagulf
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణo

సెంట్రల్‌ మయన్మార్‌లోని ఓ నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకంది. మొనైవా నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింద్‌విన్‌ నదిలో పడవ బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. 154 మందిని ప్రాణాలతో రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 240 నుంచి 250 మంది వరకు ప్రయాణికులు పడవలో ఉన్నారని, వారంతా యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లని అధికారి ఒకరు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య 100కి పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. .
ప్రమాదానికి సంబంధించి పడవలో పని చేస్తున్న నలుగురు సిబ్బందిని అరెస్టు చేశామన్నారు.పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలను ఆశ్రయిస్తుంటారు. పడవ నిర్వాహకులు ప్రమాణాలు పాటించకుండా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఇటువంటి ప్రమాదాలు మయన్మార్‌లో తరచూ జరుగుతున్నాయని అధికారులు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com