నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైళ్ల వేగం పెంపుపై అధ్యయనం..
- October 17, 2016
నాగ్‌పూర్-సికింద్రాబాద్ నగరాల మధ్య రైళ్ల వేగం గంటకు 200 కి.మీలకు పెంచడానికి సంబంధించి తొలి అడుగు పడింది. దీనిపై అధ్యయనానికి రష్యాతో ఒప్పందం కుదిరిందని సోమవారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత రైల్వే బోర్డు ప్రతినిధి నవీన్ కుమార్ శుక్లా, రష్యా రైల్వే శాఖ ప్రతినిధి బెలోజెరోవ్ సంతకాలు చేశారు.నాగ్‌పూర్-సికింద్రాబాద్ కారిడర్‌లో నడుస్తున్న రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచడానికి సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అవరోధాలపై అధ్యయనం చేస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు సమానంగా భరిస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







