గల్ఫ్ లో తెలుగు వారిని నిలువునా ముంచేసిన తెలుగు వ్యక్తి
- October 18, 2016
బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిన తెలుగువారిని తోటి తెలుగు వ్యక్తే నమ్మించి నిలువునా ముంచిన ఘటన వెలుగుచూసింది. విదేశీ గడ్డపై కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకున్న మొత్తాన్ని వసూలు చేసి రూ.45 కోట్లతో ఉడాయించాడని బాధితులు దుబాయ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ వ్యక్తి అతని భార్యతో కలిసి అయిదేళ్ల కిందట దుబాయ్ కు వెళ్ళాడు. అక్కడ ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశాక సొంతంగా ఓ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించాడు. అక్కడ పనిచేస్తున్న తెలుగువారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. వారం కిందట అతను సుమారు రూ.45 కోట్లతో అమెరికాకు ఉడాయించినట్లు దుబాయ్ లో ఉన్న తెలుగువారు మాగల్ఫ్.కామ్ కి తెలిపారు. అతడి నిర్వాకం వాళ్ళ సుమారు 50 కుటుంబాలు వీధిన పడ్డాయి. బాధితులు న్యాయం కోసం దుబాయ్, భారత పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై దుబాయ్ లో కేసు నమోదైందిని భాదితులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







