సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా...

- October 18, 2016 , by Maagulf
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా...

సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదా పడింది. నవంబరు 12 నుంచి 22 వరకూ పది రోజులపాటు ఆయన అక్కడ పర్యటించాలని భావించారు. కానీ ఆ సమయంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ఉంటోంది. అక్కడి పారిశ్రామిక సంస్ధలు, కంపెనీల దృష్టి ఎన్నికలపైనే ఉంటుందని, హడావుడి ముగిసి కొత్త అధ్యక్షుడి విధానాలపై కొంత స్పష్టత వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు.కాగా.. చంద్రబాబు బుధవారం గుంటూరు నగరానికి రానున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమార్తె రేణుక వివాహానికి హాజరవుతారు. అంతకంటే ముందు గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన తొలిసారిగా సందర్శించనున్నారు.10 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com