ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపి బీజేపీలో చేరారు...
- October 19, 2016
ప్రముఖ మలయాళ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపి బుధవారం బీజేపీలో చేరారు. ఏప్రిల్ లో కేంద్రం ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మద్దతుతో ఆయన పెద్దల సభలో అడుగు పెట్టారు. అప్పుడే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆయన బీజేపీలో చేరలేదు. ఇటీవల జరిగిన కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని ఎన్నికల బరిలో నిలపాలని భావించగా, పోటీ చేసేందుకు సురేశ్ గోపి విముఖత వ్యక్తం చేశారు.2014 వరకు కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఆయన తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు.57 ఏళ్ల సురేశ్ గోపి నటుడిగా కొనసాగుతూనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. బీజేపీలో చేరడం ద్వారా ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







