కళ్యాణ్ రామ్ మరోసారి అనీల్ రావిపూడి దర్శకత్వంలో....
- October 19, 2016
దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది.అదే జోష్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మూడో సినిమాను ఎనర్జిటిక్ రామ్ హీరోగా తెరకెక్కించాలని భావించినా., ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి పటాస్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజం సినిమా పూర్తి చేసిన కళ్యాణ్ రామ్, మరోసారి అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న జూనియర్, నెక్ట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు అనీల్. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







