బిగ్ బి ని కలిసిన శాతకర్ణి

- October 19, 2016 , by Maagulf
బిగ్ బి ని కలిసిన శాతకర్ణి

అమితాబ్ - బాలకృష్ణ సీరియస్‌గా మాట్లాడుతున్నారు. లొకేషన్.. సమయం, సందర్భం విషయానికొస్తే.. తన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో బిజీగా వున్నప్పుటికీ, తీరిక చేసుకుని ముంబైకి వెళ్లాడు నందమూరి బాలకృష్ణ. అక్కడ సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న 'సర్కార్ 3' సెట్స్‌లో బిగ్ బీ అమితాబ్‌ని కలుసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు నటీనటులు కాసేపు చర్చించుకున్నారు. తన చిత్రంలోని విశేషాల గురించి బాలయ్య వివరించగా.. మంచి క్వాలిటీ, కంటెంట్‌లతో కూడిన మూవీలతో టాలీవుడ్ ముందుకొస్తున్నందుకు అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా రాజమౌళి మూవీ బాహుబలి 2 గురించి ప్రస్తావించాడు. అటు బాలయ్య.. రామ్ గోపాల్‌వర్మను మరికొందరి నటీనటులను కలిసి మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com