మక్కాలో భాగ్య నగర యాత్రికురాలు మృతి
- October 19, 2016
హైదరబాద్ కి చెందిన హజ్ యాత్రికురాలు హుర్మతున్నీసా మక్కాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నగరంలోని ఆసీఫ్ నగర్ లోని ఎస్బీహెచ్ కాలనీలో నివాసముండే హుర్మతున్నీసా గత ఆగస్టు 23న భర్త ముహమ్మద్ గౌస్‌తో కలిసి హజ్‌యాత్ర కోసం మక్కాకు వెళ్లారు. ఈ నెల 11న నగరానికి తిరిగి రావాల్సి ఉంది.
హజ్ ముగిసిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చికిత్సకోసం మక్కాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో ముస్లిం సంప్రదాయంప్రకారం ఆమె మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ అహమ్మద్ సంతాపం వ్యక్తం చేశారు.
మృతురాలి భర్త మహమ్మద్ గౌస్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని జెడ్డాలోని భారత రాయబారికి ఫోన్లో విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







