ఖతార్ యూనివర్సిటీలో ఎమిర్ షేక్
- October 20, 2016
ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, ఖతార్ యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ పలు కొత్త ప్రాజెక్టుల్ని, కేంద్రాల్ని, అలాగే ప్లాంట్స్‌ని పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల గురించి యూనివర్సిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఎమిర్ షేక్. అలాగే విద్యార్థులతోనూ మమేకమై వారి నుంచి అభిప్రాయాల్ని తీసుకున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీసెర్చర్స్ పలు అంశాలపై ఎమిర్ షేక్‌కి ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాల్ని సమాజం మేలు కోసం ఉపయోగించాల్సిందిగా ఎమిర్ షేక్ విద్యార్థులకు సూచించారు. యూనివర్సిటీ కాలేజీలకు చెందిన డీన్‌ని కలిశారు. యువత సమాజానికి అతి పెద్ద ఎస్సెట్ అని చెబుతూ, ఆ యువత దేశానికి భవిష్యత్ అని ఈ సందర్భంగా ఎమిర్ షేక్ మంచి మెసేజ్‌ని ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..









