బస్‌ ఫేర్‌ కోసం ఆర్‌టిఎ స్మార్ట్‌ సిస్టమ్‌

- October 21, 2016 , by Maagulf
బస్‌ ఫేర్‌ కోసం ఆర్‌టిఎ స్మార్ట్‌ సిస్టమ్‌

దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, కొత్తగా ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ (పిఓసి) అనే విధానం ద్వారా ప్రయాణీకులు పబ్లిక్‌ బస్‌ ట్రిప్‌లను ఎలాంటి కార్డులు లేకుండా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్‌టిఎ ఈ విషయాన్ని 36వ జిటెక్స్‌ టెక్నాలజీ వీక్‌లో వెల్లడించింది. బి ఇన్‌ - బి ఔట్‌ అనే కాన్సెప్ట్‌లో ఈ కొత్త విధానం ద్వారా టికెటింగ్‌ జరుగుతుంది. 'బిబో'గా దీన్ని పరిగణించనున్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకుడు బస్‌లోకి స్మార్ట్‌ కార్డ్‌, స్మార్ట్‌ ఫోన్‌ని తన వద్ద ఉంచుకుంటే సరిపోతుంది. కార్డ్‌ని స్వైప్‌ చేయడం లేదా స్మార్ట్‌ ఫోన్‌ని వినియోగించడం చేయనక్కర్లేదు. బిబో సిస్టమ్‌ ఆ స్మార్ట్‌ కార్డ్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ని రీడ్‌ చేసి, తనంతట తానుగా ఫేర్‌ని కలెక్ట్‌ చేస్తుంది. ఎన్‌ఓఎల్‌ కార్డు ద్వారా పంచ్‌ చేసే విధానానికి ఈ బిబో సిస్టమ్‌ ద్వారా చెక్‌ పెట్టవచ్చు. తద్వారా క్లియర్‌గా ఫేర్‌ కలెక్షన్‌ జరగడంతోపాటుగా సమయం కూడా వృధా అవకుండా ఉంటుంది. స్మార్ట్‌ దుబాయ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ బిబో సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com