మహిళా విద్యార్ధుల మధ్య తగాదా... కళాశాలలో ' సెంటు బుడ్డీల సమరం '
- October 21, 2016
కువైట్: " నాలుగు కొప్పులు కలిస్తే ప్రళయమే " అన్న మన తెలుగు సామెత కువైట్ లోనూ సరిగ్గా సరిపోతుంది. మరి వారే కలహిస్తే , గుమ గుమ లాడే సువాసనల మధ్య గుభీ గుభీ మంటూ గుద్దులాటతో మహిళా కళాశాల మారుమోగిపోతుంది. వివరాలలోకి వెళితే కువైట్ ప్రాథమిక విద్య కళాశాలలో చదువుతున్న ఓ నలుగురు మహిళా విద్యార్థులు ఇటీవల కళాశాలలో జరిగిన 'ఎన్నికల ఫలితాలు పై తీవ్రంగా చర్చ జరుపుతున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య చిచ్చు చెలరేగింది. దాంతో వారు తమ బ్యాగులలో ఉన్న సెంటు సీసాలు..ఆయుధాలుగా మారిపోయాయి... ప్రత్యర్థులపై పరిమళం సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొంటూ..కాసేపు కళాశాలను మినీ కురుక్షేత్రం చేశారు. ఆ సెంటు బుడ్డీల సమరంలో గాయపడిన ఓ మహిళా విద్యార్థిని ఆస్పత్రి పాలయ్యంది. మిగిలిన స్టూడెంట్స్ వీరి పోరాటం విచ్ఛిన్నం చేయడానికి నీటిని ఉపయోగించి నిలువరించారు . మిగిలిన ముగ్గురు విదార్థినులను కళాశాలలోనే చికిత్స కోసం చేర్పించారు . పోలీసులను కాలేజీ క్యాంపస్ లోనికి అనుమతించకపోవడంతో కదనరంగం కాసేపు కొనసాగింది..తోటి మహిళా విద్యార్థులు ఆ మహిళా యోధులపై నీటిని బలంగా పిచికారీ చేసి విడదీశారు. అప్పటివరకు పోలీసులు నిస్సహాయులుగా ఉండి వెలుపలే నిరీక్షిస్తూ ఉండిపోయారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







