స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు

- October 21, 2016 , by Maagulf
స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గత మూడు రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధర నేడు కాస్త దిగొచ్చింది. నగల వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడంతో పుత్తడి తగ్గుముఖం పట్టింది. రూ. 140 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 30,400గా ఉంది. ఇక వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com