పెసర ఖీమా
- October 22, 2016
కావలసినవి: పెసలు 200 గ్రా., రిఫైండ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు (ఒక ఉల్లిపాయను సన్నగా తరగాలి; మరో పాయను ముద్దగా నూరుకోవాలి), అల్లం ముద్ద ఒక టీ స్పూను, వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూను, పచ్చి మిరపకాయల ముద్ద ఒక టీ స్పూను, (తరిగిన) క్యాప్సికమ్ ఒకటి, పచ్చి బఠాణీలు అర కప్పు, తరిగిన కొత్తిమీర ఒక కప్పు (ముద్దగా చేయాలి), వెనిగర్ రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి ఒక టీ స్పూను, ఉప్పు తగినంత. పైన అలంకరించడానికి: ఉడికించిన పచ్చి బఠాణీలు అర కప్పు, పచ్చిమిరపకాయలు 4.
ఎలా చేయాలి
పెసల్ని గంట సేపు నానబెట్టి బరకగా రుబ్బుకోవాలి. నాన్‌స్టిక్ కడాయిలో నూనెని వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. తర్వాత ఉల్లి, వెల్లుల్లి, అల్లం ముద్దలను వేసి 2 నిమిషాల పాటు వేగించాలి. పెసర ముద్ద, పచ్చిమిరపకాయల ముద్దను కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి మరో ఐదు నిమిషాలు వేగించాలి. మూతపెట్టి సన్నని మంట మీద ఉడికిస్తూ మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. పెసరపప్పు పూర్తిగా ఉడికాక కొత్తిమీర ముద్ద, వెనిగర్ వేసి కలపాలి. పప్పు మిశ్రమం దగ్గరపడేవరకు ఉంచి తర్వాత గరం మసాలా పొడిని చల్లి కిందకు దించాలి. నిలువుగా చీరిన పచ్చిమిర్చితోను, ఉడికించిన పచ్చి బఠాణీలతోనూ అలంకరించాలి. వేడి వేడి చపాతీలు, పరోఠాలతో దీనిని తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









