వరుస పేలుళ్లు తో మణిపూర్....

- October 23, 2016 , by Maagulf
వరుస పేలుళ్లు తో మణిపూర్....

 మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రం ఇబోబీ సింగ్ పర్యటన నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటన స్థలం వద్ద భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో ఓ హ్యాండ్ గ్రనేడ్ గుర్తించిన పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చేశారు.
పాక్‌ సైన్యం కాల్పుల్లో జవాను మృతి
శ్రీనగర్‌: దేశ సరిహద్దుల్లో పాక్‌ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
జమ్మూకాశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా, పర్‌గ్వాల్‌, కనాచక్‌ ప్రాంతాల్లోని సైనిక శిబిరాలపై పాక్‌ సైన్యం పలుమార్లు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com