ఉదమ్ కిరణ్ అల్లరి నరేష్ కి షాకింగ్ విషయం చెప్పాడంట ..!

- October 23, 2016 , by Maagulf
ఉదమ్ కిరణ్ అల్లరి నరేష్ కి   షాకింగ్ విషయం చెప్పాడంట ..!

'చిత్రం' సినిమాతో తెరగ్రేటం చేశాడు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేకున్నా స్టార్ హీరో స్టేటస్ సంపాదించాడు. అయితే అర్థాంతరంగా తనువు చాలించాడు. తాజాగా ఉదమ్ కిరణ్ గురించి ఆయన మిత్రుడు హీరో అల్లరి నరేష్ ఒక విషయం చెప్పాడు. చనిపోక ముందు రోజు అల్లరినరేష్ ను ఉదయ్ కిరణ్ కలిశాడట. ఆ సమయంలో ఎందుకోగానీ ఉదయ్ ముఖంలో దిగులు బాధ కనిపించాయట. దీంతో "ఏమైంది.. ఎందుకలా ఉన్నావ్" అని అడిగితే.పొద్దునే పేపర్లో వచ్చిన ఆర్టికల్ లో ఒక యువ కథానాయకుడు కథలు సరిగా ఎంచుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడట. దీనిపై స్పందించిన నరేష్. "దానికెందుకు అంత బాధపడుతున్నావ్.. నీకు సంబంధించిన విషయం కాదు కదా" అని అనగా అనంతరం షాకింగ్ విషయం చెప్పాడంట ఉదయ్ కిరణ్."ఆ ఆర్టికల్ వేరే హీరోకు సంబంధించిందే అయినా. అతడు కథలు ఎంచుకోవడంలో మార్పు రాకపోతే అతడికి కూడా చివరికి ఉదయ్ కిరణ్ గతే పడుతుంది" అంటూ తనను ఉదాహరణగా చూపించారు అని బాధపడ్డాడట. దాంతో తన నోట మాట రాలేదని చెప్పాడు నరేష్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com