నా బ్యానర్‌లో 25 సినిమా 'రెమో'

- October 24, 2016 , by Maagulf
నా బ్యానర్‌లో 25 సినిమా 'రెమో'

శివకార్తికేయన్‌, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్‌టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్‌.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, సాంగ్ ఇటీవలే విడుదలయ్యాయి..ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ - "నేను నిర్మాతగా నా బ్యానర్‌లో 25 సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ సినిమాను రీమేక్ చేయలేదు. తొలిసారి రెమో ట్రైలర్ చూసి సినిమాను రీమేక్ చేయాలనిపించేంతగా ఇన్‌స్పైర్ అయ్యాను. తమిళంలో ఈ సినిమాను నేను ఒక్కడినే ప్రివ్యూ షో వేసుకుని చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, భాష తెలియదు కదా, కాబట్టి నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, దాని వల్ల వెట్రి థియేటర్‌లో ఆడియెన్స్ మధ్య సినిమా చూశాను.ఆడియెన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయడం చూసి నాలో నమ్మకం ఏర్పడిందని అన్నారు.. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com