ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం..
- October 24, 2016
ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం లభించింది. ముంబైలోని హాజీ అలీ దర్గా అంతర్భాగంలోకి మహిళలను అనుమతిస్తామని ట్రస్ట్ పాలకవర్గం తెలిపింది. ఇప్పటి వరకూ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తొలగించడానికి అంగీకరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా సమ్మతిని తెలిపింది. దర్గాలోకి మహిళలను అనుమతించాలని గతంలో బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. తర్వాత ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. చివరకు దర్గా పాలకవర్గం మహిళల ప్రవేశానికి అంగీకారం తెలపడంతో వివాదం సమసిపోయింది. దర్గాలో ప్రవేశానికి సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ సుదీర్ఘ పోరాటం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







