'ది జంగిల్' ఫ్రెంచ్ శరణార్థి శిబిరంలో భయాందోళనలు
- October 24, 2016
మధ్యప్రాచ్యం, ఆసియా ప్రాంత దేశాల నుండి నుండి వెల్లువెత్తిన శరణార్థులను ఆదుకునేందుకు ఇక్కడ ఏర్పాటుచేసిన సహాయ శిబిరాన్ని ఎత్తివేయాలన్న ఫ్రెంచ్ సర్కారు నిర్ణయం అక్కడి వారిలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. 'ది జంగిల్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఖాళీచేయించి శరణార్థులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సోమవారం ఉదయం ప్రభుత్వం దాదాపు 60 బస్సులను సిద్ధం చేసింది. ఈ వారాంతానికి వీరిని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు చేరుస్తారు. తరువాత ఖాళీ అయిన శిబిరాన్ని పూర్తిగా తొలగిస్తారు. శరణార్థులకు సహాయం అందించేందుకు ఏర్పడిన కేర్ఫర్ కలాయిస్ గ్రూప్ వాలంటీర్ ఎన్రికా కరీవైటే ఆదివారం రాత్రి ఈ శిబిర తొలగింపు విషయాన్ని వారికి గుర్తు చేసి ప్రయాణానికి సిద్ధం కావాలని సూచించారు.పోలీసులు, వాలంటీర్లు సిద్ధంగా వుంటారని, తమతో పాటు రావాలని ఆమె వారికి చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో నరసంచారం లేని ఇసుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో రాత్రి చీకటిపడిన తరువాత శరణార్థి బృందాలు చలి మంటల వెలుగులో తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి. ఈ మంటల వెలుగులో సేదతీరే శరణార్థులను పలువురు నిఘా పోలీసులు కాపలా కాస్తుంటారు. కొన్ని సందర్భాలలో వారిపై దౌర్జన్యం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.
ఇక్కడ తలదాచుకుంటున్న దాదాపు 6,486 మంది శరణార్థులను తరలించేందుకు 8,300 మంది కార్యకర్తలతో కూడిన సహాయక బృందాలు రెండు నెలల నుండి నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఈ తరలింపు ప్రక్రియ ఈ వారాంతానికి పూర్తి కావల్సి వుంది. ఇక్కడి నుండి తరలివెళ్లే శరణార్థులు ప్రభుత్వం తమకు సూచించిన రెండు ప్రాంతాలలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. ఈ ప్రాంతాల వివరాలను అధికారులు వారికి ఆదివారం నాడు తెలియచేయటం విశేషం.
తమ లక్ష్యం నెరవేరిందని, ప్రతి ఒక్కరికీ చోటు దక్కే విధంగా దాదాపు 7 వేల ప్రదేశాలను ఎంపిక చేశామని కలాయిస్ సోషల్ కొహెషన్ డైరెక్టర్ సెర్జీ స్జార్జిన్స్కీ చెప్పారు. అయితే ఎక్కువ మంది శరణార్థులకు వారి గమ్యం ఏమిటన్న విషయం తెలియదు. తరలింపు గడువు సమీపిస్తున్నా దీనిపై ఇటు అధికారులు కానీ, సహాయక బృందాలు కానీ వారికి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. శిబిరంలోని కొంతమంది శరణార్థులు తాము నగర ప్రాంతాలకు బదులుగా ఎటువంటి ఆర్థిక, ఉపాధి అవకాశాలు లేని మారుమూల పల్లెలకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







