ఏపీలోనూ 60 మినీ జిల్లాలు విభజించి పాలన..

- October 25, 2016 , by Maagulf
ఏపీలోనూ 60 మినీ జిల్లాలు విభజించి పాలన..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అన్ని విషయాల్లోనూ పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిని మించి మరొకరు అభివృద్ధి పనుల్లో పోటీ పడుతూ రాష్ట్రాలను ప్రగతి పథంలో నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలు, తిరస్కరణలు ఎదురవుతున్నా వాటిని లెక్క చేయకుండా తామనుకున్న పని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఇద్దరు చంద్రులు.తెలంగాణలో ఈ దసరా నుంచే కొత్తగా 33 జిల్లాలకు అంకురార్పణ చేశారు సీఎం కేసీఆర్‌. చిన్న జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో పాలనా మరింత సులభతరమైంది. జిల్లా కేంద్రాలు కూడా గ్రామాలకు దగ్గరవడంతో ప్రజలకు వ్యయభారం తగ్గడంతో పాటు సమయం కలిసివస్తోంది. అటు అధికారులు సమస్యలపై దృష్టిపెట్టేందుకు అవకాశం ఏర్పడడంతో తెలంగాణలో పాలన మరింత సులభతరమైందని భావిస్తున్నారు.

ఇప్పుడు అదే బాటలో ఏపీ సర్కారు కూడా నడవాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీ పరిమాణంలో కకాస్త పెద్దదే. కానీ 13 జిల్లాలతోనే పాలన సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది కాస్త ఇబ్బందిగానే ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇదే తరుణంలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరగడంతో.. అటు ఏపీలోనూ ఈ విధానాన్ని అవలంభించాలని తలపోస్తోంది బాబు సర్కార్‌. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ను 60 మినీ జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించి పాలనను వికేంద్రీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు
.
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని భావిస్తున్నారు
.
సర్కారు సరికొత్త నిర్ణయంతో ఆర్డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది
.
ఇంచుమించుగా కలెక్టర్‌ లాగానే అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల తీరును రెవెన్యూ డివిజన్లలో పర్యవేక్షించాల్సి ఉంటుంది
.
ప్రభుత్వ నిర్ణయాల్లో
అధికశాతం రెవెన్యూ డివిజన్లలోనే జరిగిపోవాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు అధికారులు
.
అలాగే పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్డీవోకు సమానంగా మార్చాలని నిర్ణయించారు
.


డీఎస్పీల స్థాయిని పెంచి ఎస్పీల అధికారాల్లో కొన్నింటిని వారికి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది
.
రాష్ట్ర
ంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారుల్లో సమర్థులను ఎంపిక చేసి వారిని ఆర్డీవోలు, డీఎస్పీలుగా ప్రమోట్‌ చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది ఏపీ సర్కార్‌. ప్రభుత్వ పథకాల అమలులో వీరి పాత్రను కీలకం చేయనున్నారు
.
త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని
ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
.
జిల్లాను ఏమాత్రం విభజించకుండానే పరిపాలనను
వికేంద్రీకరించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com