చికెన్‌ కరాహి

- October 25, 2016 , by Maagulf
చికెన్‌ కరాహి

కావలసిన పదార్థాలు: చికెన్‌:అరకిలో (ముక్కలుగా చేసుకోవాలి), టమోటాలు: మూడు(ముద్ద చేసుకోవాలి), అల్లం:చిన్న ముక్క(సన్నగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు లేక ఐదు(ముక్కలుగా చేసుకోవాలి), ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, పసుపు: చిటికెడు, కారం: టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: పావుకప్పు,కొత్తిమీర: కొద్దిగా 

తయారీ విధానం: మందపాటి గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. అనంతరం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఓ నిమిషం పాటు వేయించుకుని తరువాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సన్నని మంట మీద ఉడికించాలి. చికె న్‌ కొద్దిగా ఉడికిన తరువాత టమోటా ముద్ద, ఉప్పు, కారం, పసుపు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. కూర ముద్దగా అవుతున్న సమయంలో అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర జతచేసి దింపేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com