తుపాకీతో తీవ్రవాదులు కాల్పులు దమ్మంలో ఇరువురు పోలీసులు మృతి

- October 26, 2016 , by Maagulf
తుపాకీతో  తీవ్రవాదులు  కాల్పులు దమ్మంలో ఇరువురు పోలీసులు మృతి
జెడ్డా : మంగళవారం ఉదయం రాస్ తానురా జిల్లాలోని కార్యాలయం నుండి సౌదీ భద్రతా సిబ్బంది ఇరువురు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని తీవ్రవాదులు వారిపై భారీ కాల్పులు జరిపి పారిపోయారు. కాగా ,ఈ దాడిలో పోలీసులు అక్కడక్కడే మరణించారు.భద్రతా సంస్థలు ఈ కేసు విచారణ చేసి నేరాన్ని పరిశోధిస్తున్నారు. 
తూర్పు ప్రాంతం పోలీస్ కల్నల్ జియాద్ అల్ రాకీటీ  యొక్క మీడియా ప్రతినిధి ఈ సంఘటన వివరాలు తెలియచేస్తూ, మంగళవారం అర్ధరాత్రి సమయంలో డమ్మామ్ నగరంలోని ఆల్-డాబాబు  పొరుగున ఉన్న కింగ్ సౌద్ సందులో ఒక నిర్జన ప్రదేశంలో గస్తీ తిరుగుతున్నఇరువురు భద్రతా సిబ్బందిపై భారీ కాల్పులు జరిపారని తెలిపారు. అల్ రాకీటీ  ప్రత్యేక భద్రతా అధికారులు తీవ్రవాదుల దాడికి కారణాలు ఆ మరణాల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు గుర్తించడానికి  నేర విచారణ ప్రారంభించారు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com