నవంబర్ 10న అనంతపురంలో జనసేన బహిరంగ సభ
- October 26, 2016
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో సభ ఖారారైయింది. నవంబర్ 10న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ ఏర్పాటు చేయనుంది జనసేన. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈ సభలో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, హక్కులపై పై కేంద్రాన్ని నిలదీయనున్నారు. దీనికి సంబంధించి జనసేన ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఇప్పుడీ సభకు పేరును మార్చించింది జనసేన. గత రెండు సభలు 'సీమాంద్రల ఆత్మ గౌరవ'సభ పేరుతొ జరిగిన సంగతి తెలిసిందే. ఐతె నవంబర్ 10న అనంతపురంలో తలపెట్టిన బహిరంగ సభకుమాత్రం 'సీమాంధ్ర హక్కుల చైతన్య'సభగా పేరు పెట్టారు పవన్ కళ్యాణ్.
అలాగే, సభా ప్రాంగణానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి, సభా వేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేర్లను ఖరారు చేసినట్లు తాజా ప్రకటనలో తెలిపారు.
అనంతపురం జిల్లాలో పుట్టి రాష్ట్రానికి, ఈ దేశానికి అపార సేవలందించిన మహనీయులు నాగిరెడ్డి, సుబ్బారావులను ఈ సందర్భంగా స్మరించుకోవడం జనసేనకు కలిగిన భాగ్యంగా చెప్పుకొచ్చారు పవన్. నవంబర్ 10 సాయంత్రం 4గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ సభ జరుగనుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







