ట్విట్టర్ దీవాలి ఎమోజీ ఈ నెల 28 నుండి నెటిజన్లకు అందుబాటులో
- October 26, 2016
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ఈ ఏడాది దీపావళి ఎమోజీ ఏది పెట్టాలనే నిర్ణయంపై నెటిజన్ల అభిప్రాయాలను కోరింది. ప్రతి పండుగ సమయంలో ట్విట్టర్‌నెటిజన్లకు శుభాకాంక్షలు చెబుతూ వారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎమోజీని ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ ఏడాది దీపాల పండుగ సందర్భంగా ఎమోజీని పెట్టేందుకు ప్రజల అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరింది. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై వారి నిర్ణయాలను తెలియజేయాలని ట్విట్టర్ ఇండియా పేర్కొంది. గతేడాది దీపావళి సందర్భంగా ట్విట్టర్ ప్రత్యేక దీపావళి ఎమోజీని ప్రవేశపెట్టింది. హ్యాష్‌ట్యాగ్‌తో హ్యాపీ దీపావళి అని పెట్టినప్పుడు దాని పక్కన ఈ ఎమోజీ వచ్చింది.
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా, చీకటికి తొలగించే కాంతిగా, అసత్యంపైన నిజం గెలుస్తుందనే దానికి ప్రతీకగా దీన్ని పెడుతున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఆరెంజ్, గ్రీన్, పింక్, బ్లూ రంగుల్లో ఏది దీపానికి పెట్టాలి అనే దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీనిపై మంగళవారం నుంచి ఓటింగ్ ప్రారంభంకాగా 48 గంటల్లో ముగుస్తోంది. ఎక్కువ మంది ఏ రంగు పెట్టాలని నిర్ణయిస్తారో దాన్నే ఈ ఏడాది దీపావళి ఎమోజీ కింద పెడతామని తెలిపింది.
ఈనెల 28 నుంచి ఈ ఎమోజీ నెటిజన్లకు అందుబాటులోకి రానుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం, గణేశ్ చతుర్థి, మేక్ ఇన్ ఇండియా తదితర సమయాల్లో ప్రత్యేక ఎమోజీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







