సిరియాలోని ఓ పాఠశాలపై వైమానిక దాడి...
- October 27, 2016
సిరియాలోని ఓ పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 22 మంది చిన్నారులు, ఆరుగురు ఉపాధ్యాయులు మరణించినట్లు ఐరాస పిల్లల విభాగం యునిసెఫ్ వెల్లడించింది. ఇది అత్యంత విషాదమని, యుద్ధనేరమని యునిసెఫ్ డైరెక్టర్ ఆంటోనీ లేక్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఇడిలిబ్ ప్రావిన్స్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని లేక్ పేర్కొన్నారు.రష్యా, సిరియా యుద్ధ విమానాలు ఇడిలిబ్ ప్రావిన్స్‌లోని హాస్ గ్రామంలో దాదాపు ఆరుసార్లు వైమానిక దాడులకు పాల్పడ్డారని, పాఠశాల కాంప్లెక్స్‌పైనా దాడులు చేయడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని సిరియాకు చెందిన ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ కూడా వెల్లడించింది.దాడులకు సంబంధించి పాఠశాలలోని హృదయవిదారక దృశ్యాలు సోషల్‌మీడియాలు కనిపిస్తున్నాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలు, తిరుగుబాటుదారుల దాడులు, అంతర్యుద్ధంతో సిరియా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను అణచడానికి సిరియా ప్రభుత్వం ఇతర దేశాల సహాయంతో వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా సమిధలవుతున్నారు.
తాజా వార్తలు
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!









