కాటమరాయుడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ ...

- October 29, 2016 , by Maagulf
కాటమరాయుడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. రాయల సీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడరు కనిపించబోతున్నాడు.తాజాగా, దీపావఌ కానుకగా కాటమరాయుడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.'తెల్ల లుంగీ, రెడ్ షర్ట్ వేసుకొన్న పవన్ చిరు నవ్వులు చిందిస్తూ సైకిల్ తొక్కుతున్న పిక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. పిక్ వెనకాలా బ్యాక్ పచ్చని పల్లె వాతావరణంతో కూడిన చెట్లుకనిపిస్తున్నాయి' ఇప్పుడీ పిక్ మెగా అభిమానులకి పిచ్చి పిచ్చగా నచేసింది. పవన్ చాలా అందంగా కనిపిస్తున్నాడని ఆనందపడుతున్నారు.ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ జెడ్ స్వీడుతో కొనసాగుతోంది. ఫ్యాక్షన్ సినిమా అయినా.. ఇందులో ఖుషి మారిదిరిగా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండనున్నాయట. ఇందులో పవన్ కి ముగ్గురు తమ్ముళ్లుగా కూడా ఉండనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com