వలస వ్యాపారవేత్తకి కష్టాలు
- October 29, 2016
మనామా: భారతీయ వ్యాపారవేత్త, కింగ్‌డమ్‌లో 2007 నుంచి ఇరుక్కుపోయారు. ఆయనపై ట్రావెల్ బ్యాన్ కారణంగా ఈ సమస్య వచ్చింది. తాను బహ్రెయిన్‌లో ట్రాప్ అయ్యాననీ, తనపై అక్రమ కేసులు బనాయించారని ఆంటోనీ గ్రేసియస్ అనే వ్యక్తి ఆరోపించారు. ట్రావెల్ బ్యాన్ నుంచి ఉపశమనం పొందేందుకు తాను 6,000 బహ్రెయిని దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉందని వాపోయారాయన. తన కారణంగా కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందనే ఆరోపణల మీద తనపై క్రిమినల్ చర్యలు తీసుకున్నారనీ, అయితే తాను పనిచేసిన కాలంలో ఆ కంపెనీ లాభాలతో నడిచిందని ఆయన చెప్పారు. 1991లో కంపెనీని స్థాపించిన ఆయన సొంతంగా మూడేళ్ళపాటు నడిపారు. 1994లో ఇంకొకరితో కలిసి పార్టనర్‌షిప్ తీసుకున్నారు. ఆ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత బాగానే నడిచినా, ఇంకో ఓనర్ జనరల్ మేనేజర్‌ని హైర్ చేసుకున్న తర్వాత నష్టాలు వచ్చాయని తెలిపారాయన. తాను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడాదికే ఆ సంస్థను అమ్మేశారట. వాస్తవంగా తాను ఎలాంటి సొమ్ములూ ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









