దర్శకురాలిగా ఘట్టమనేని మంజుల....

- October 30, 2016 , by Maagulf
దర్శకురాలిగా ఘట్టమనేని మంజుల....

ది నుంచి సినీ రంగంలో వారసురాళ్ల హవా కనిపిస్తోంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పటికే తన సత్తా చాటగా, మరింత మంది తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఒక సూపర్ స్టార్ కి కుమార్తె, మరో సూపర్ స్టార్ కి సోదరి ఘట్టమనేని వారసురాలు మంజుల చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. నటిగానూ గుర్తింపు తెచ్చుకొని 'షో' లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అయితే నిర్మాతగా కొన్ని ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సి వచ్చింది. దీంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న మంజుల... తాజాగా మరోసారి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమౌతోంది. అయితే ఈసారి నటిగానో, నిర్మాతగానో కాకుండా దర్శకురాలిగా సత్తాచాటేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఓ కథ రెడీ చేసిన మంజుల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుందని.. ఇండస్ట్రీలో వినవస్తున్న సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com