దుబాయ్ విమానాశ్రయంలో డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్ అనధికార చక్కర్లు

- October 30, 2016 , by Maagulf
దుబాయ్ విమానాశ్రయంలో డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్ అనధికార చక్కర్లు

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనికి శనివారం సాయంత్రం ఒక డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్ చొరబడి చక్కర్లు కొట్టడంతో ఒక గంటసేపు ట్రాఫిక్ స్థంభన ఏర్పడింది. ప్రపంచంలోనే రద్దీ అయిన విమానాశ్రమంలో ఒకటైన దుబాయ్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ ఏర్పడటం గత ఐదు నెలల కాలంలో ఇటువంటి సంఘటన జరగడం ఇది మూడవసారి.విమానాశ్రయం చుట్టూ ఉన్నఅంతరిక్ష పరిధి లోనికి  రాత్రి 7:25 నుండి రాత్రి  8:49 (1525-1649 గ్రీనిచ్ మీన్ టైం) వరకు మూసివేశారు అనధికార డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్ చక్కర్ల  కార్యకలాపం కారణంగా పలు  విమాన మళ్లింపులు జరిగేయని దుబాయ్ విమానాశ్రయ నిర్వాహుకులు తెలిపారు.జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ షార్జాలో విమానాశ్రయంలో సైతం  సుమారు 15 కిలోమీటర్ల (తొమ్మిది మైళ్ళు) దూరంలో ఇదే సమయంలో మూసివేసినట్లు తెలిపారు.ఎందుకంటే అదే డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్ గాలిలో ఎగరడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఆ చర్యలు తీసుకొన్నారు. దుబాయ్ విమానాశ్రయాలతో పాటు  ఏ విమానాశ్రయం పరిధిలోనైనా ప్రయాణికుల భద్రతని దృష్టిలో ఉంచుకొని ఐదు కిలోమీటర్ల (మూడు మైళ్ళు) పరిధి దూరంలో  డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్లు ఎగరడాన్ని నిషేదించబడినట్లు  డ్రోన్ నిర్వాహుకులకు ఒక ట్వీట్ లో నొక్కి  చెప్పారు. గత జూన్ 12 వ తేదీన మరియు సెప్టెంబర్ 28 వ తేదీన ఇదే విమానాశ్రయంలోనికి  డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్ ప్రవేశించి విమానాలవద్దకు అతి సమీపంగా వచ్చింది. ఈ కారణంగా ఒక తడవ ఒక గంట మరోమారు సుమారు అర గంట సేపు విమానాశ్రయం మూతపడింది.డ్రోన్ బొమ్మ హెలికాఫ్టర్  కొనుగోలు మరియు వాటిని  ఉపయోగిస్తే  ఉల్లంఘిస్తే వారిపై జరిమానాలు తీసుకోబడతాయని యు ఏ ఇ అధికారులు ప్రకటించారు. సుమారు 100 విమానయాన సంస్థలు 260 కంటే ఎక్కువగమ్యస్థానాలకు ఎమిరేట్స్ దుబాయ్ లకు తమ తమ విమానాల ద్వారా ప్రయాణికులను చేరుస్తుంటాయి. గత సంవత్సరం ఈ విమానాశ్రయం ద్వారా 78 మిలియన్ మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com