నేడు భారత దేశ రాజధానిలో వంద అగ్ని ప్రమాదాలు

- October 30, 2016 , by Maagulf
నేడు భారత దేశ రాజధానిలో వంద అగ్ని ప్రమాదాలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కాల్చే బాణసంచా కారణంగా దేశ రాజధాని దిల్లీ వ్యాప్తంగా దాదాపు వంద చిన్న చిన్న అగ్నిప్రమాదాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని వివరించారు. దీపావళి పండుగ సెలవు తీసుకోకుండా దిల్లీ అగ్నిమాపక దళాలు పనిచేస్తున్నట్లు ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. దీనిపై అగ్నిమాపక ముఖ్య అధికారి జీసీ మిశ్రా మాట్లాడుతూ 1500 ఫైర్‌ ఫైటర్స్‌ను వివిధ ప్రాంతాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 59 అగ్నిమాపక కేంద్రాలున్నాయని, అదనంగా 22కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతేడాది లెక్కల ప్రకారం 290 కేసులు నమోదయ్యాయని, ఈ సారి ఎలాంటి నష్టం జరగకుండానే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని అన్నారు.

అటు సర్దార్‌జంగ్‌ ఆస్పత్రి, రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద బాధితుల కోసం అదనపు వార్డులు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com