సహజంగా రుతుక్రమాన్ని వాయిదా వేయడం

- October 30, 2016 , by Maagulf
సహజంగా రుతుక్రమాన్ని వాయిదా వేయడం

12-50 సంవస్సరాల వయస్సు కలిగిన ప్రతీఒక్క మహిళకు రుతుక్రమం వస్తుంది. ఈ బౌతిక పరిస్థితి ప్రతీఒక్క స్త్రీలో స్త్రీ తత్వాన్ని బయటకు తెస్తుంది. కాని రుతుక్రమ సమయంలో ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క విధంగా భాదను అనుభవిస్తుంది. నొప్పులు మరియు ఇతర భాదల వలన స్త్రీ రుతుక్రమ భాదను అనుభవిస్తుంది. కొన్ని మతపరమైన సమస్యల వలన మీరు రుతుక్రమ సమయంలో ఎక్కడకు వెళ్ళలేక పోతున్నారా? అయితే మీ కోసం కొన్ని చిట్కాలను ఇవ్వడం జరిగింది. వీటి వలన మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.

కొన్ని సందర్భాలలో అనగా కొన్ని శుభకార్యాలలో, ఫంక్షన్లలో, పండగ సమయంలో మీరు రుతుక్రమంలో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ మరియు మందులు ఉన్నవి రుతుక్రమాన్ని ఆలస్యం చేయడానికి, కాని వాటిని వాడటం వలన భవిష్యత్తులో పునరుత్పత్తి చేసే అవయవంకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన సహజ నివారణల ద్వారా రుతుక్రమాన్ని వాయిదా వేయడం ఉత్తమం. చాలా మంది రుతుక్రమాన్ని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు అని అనుకుంటారు. కాని కొన్నిసార్లు ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది.

మహిళలకు రుతుక్రమం ముందుగా మరియు వెనుకగా రావడానికి చాలా కారణాలు ఉన్నవి. మతపరమైన సందర్భాలలో రుతుక్రమంలో ఉన్న స్త్రీ ఎక్కడకు వెళ్ళడానికి వీలు ఉండదు. మీకు మీ పెళ్లి సందర్భంలో రుతుక్రమం వచ్చిన మీరు పూజలు చేయడానికి వీలు ఉండదు. మీరు కొన్ని ఆర్టిఫీషియల్ మరియు నెచురల్ పద్ధతుల ద్వారా రుతుక్రమాన్ని వాయదా వేయవచ్చు. కాని ఆర్టిఫీషియల్ పద్ధతులను పాటించడం ఆరోగ్యానికి మంచిది కాదు. నెచురల్ పద్ధతుల ద్వారా రుతుక్రమాన్ని వాయదా వేయడం వలన మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.

సహజంగా రుతుక్రమాన్ని వాయిదా వేయడం

కారంగా ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండుట

కారంగా ఉండే ఆహరం తీసుకోవడం వలన మీ శరీరంలో రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటే కారంగా ఉన్న ఆహారం తినకూడదు. కారంగా ఉన్న ఆహారం అనగా వెల్లుల్లి, మిరపకాయలు మరియు మిరియాలు. మీరు పూర్తిగా ఈ ఆహారాన్ని మానివేయడం వలన రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.

మూలికలు

యెల్లో టిన్చార్లు (yarrow tinctures) మరియు షేఫేర్డ్స్ పురస్ (shepherd’s purse) తీసుకొని ఎండపెట్టి పొడి చేయాలి. దానిని తినడం వలన రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. షేఫేర్డ్స్ పురస్ని అధిక రక్తస్రావం జరిగే సమయంలో ఆపడానికి ఉపయోగిస్తారు. అందువలన దీనిని రుతుక్రమ వాయిదాకు కూడా ఉపయోగించవచ్చు. పైల్స్తో బాధపడే వారికి యెల్లో టిన్చార్లు మంచి మందుగా పని చేస్తుంది. అలానే ఇది జలుబు మరియు జ్వరం వచ్చిన వారికి కూడా మంచి మందుగా పని చేస్తుంది. ఇకనుంచి దీనిని రుతుక్రమ వాయిదాకి కూడా వాడండి.

వ్యాయామం

మానసిక ఒత్తుడుల వలన కూడా రుతుక్రమం ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఈ మానసిక ఒత్తుడులు రోజూ వ్యాయామం చేయడం వలన తగ్గుతాయి. మానసిక ఒత్తుడులను దూరం చేయడమే కాకుండా శరీరానికి ఫిట్నెస్ని ఇస్తుంది.

కొంతమంది మహిళలలో రుతుక్రమం నెలలో రెండు సార్లు రావడం గమనిస్తూ ఉంటాము. ఫిసికల్ ఫిట్నెస్ లేకపోవడం వలన అల జరుగుతుంది. వ్యాయామం చేయడం వలన మీరు ఫిసికల్ ఫిట్నెస్ని పొందవచ్చు. రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ మరియు ఇతర వ్యాయామ క్రియలు చేయడం వలన ఫిసికల్ ఫిట్నెస్ని పొందవచ్చు. రుతుక్రమాన్ని సరిగా వచ్చేటట్లు చేస్తుంది.

కందిపప్పు

మీరు తీసుకునే ఆహరాన్ని బట్టి రుతుక్రమ రోజులు పెరగటం మరియు తగ్గటం జరుగుతూ ఉంటుంది. మీకు కందిపప్పు మార్కెట్లో లభిస్తుంది. కందిపప్పు తీసుకొని సూప్ తయారు చేయండి. మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటే ఏ రోజు వరకు రుతుక్రమం వాయిదా చేయాలో ఆ రోజు వరకు సూప్ తీసుకోవాలి. సూప్ తయారు చేయు విధానం తెలుసుకోండి. కందిపప్పును బాగా వేయించి, గ్రైండర్ సహాయంతో పౌడర్ తయారు చేసి నీటిలో బోయిల్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.

నీటిని త్రాగటం

మీరు నీటిని రోజు తగిన మోతాదులో తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మీరు నీటిని తక్కువగా తీసుకుంటే రుతుక్రమంలో చాలా సమస్యలు వస్తాయి. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

ఒత్తిడిని నియంత్రించడం

ఒత్తుడులు ఎక్కువగా ఉండటం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మీకు రుతుక్రమం క్రమంగా రావడం లేదు అంటే మీరు చాల ఒత్తుడులకు గురి అవుతున్నారు అని అర్ధం. మీరు యోగా చేయడం ద్వారా ఒత్తుడుల నుంచి ఉపసమనం లభిస్తుంది. ఎక్కువగా పద్మాసనం మీద కూర్చొని శ్వాస మీద శ్రద్ధ ఉంచడం వలన ఒత్తుడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఒత్తిడులను అదుపు చేసుకున్న తరువాత రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.

వెనిగర్

వెనిగర్ని ఉపయోగించి నెచురల్గా రుతుక్రమాన్ని వాయిదా వేయడం. ఒక గ్లాస్లో 3-4 స్పూన్స్ వెనిగర్ కలిపిన నీటిని తీసుకోవడం వలన మీరు 3-4 రోజుల వరకు రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. చాల రోజులవరకు రుతుక్రమం రాకుండా ఉండాలి అంటే ఇలా వెనిగర్ కలిపినా నీటిని రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి.

కొత్తిమీర

మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అంటే ఒక సులువైన పద్ధతి కొత్తిమీరను ఉపయోగించడం. కొత్తిమీర మనకు చాల సులువుగా లభిస్తుంది. కొత్తిమీరను నీటిలో 20 నిమిషములపాటు బోయిల్ చేయాలి. బోయిల్ చేసిన నీటిని వడపోసి, ఆ నీటిలో తేనే కలుపుకొని రోజుకి రెండుసార్లు త్రాగటం వలన మీ రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.

నాణ్యత ఉన్న నీటిని తీసుకోవడం

రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అంటే ఎక్కువగా నీటిని తీసుకోవాలి. చాలా మంది మహిళలు రోజూ తక్కవ మోతాదులో నీటిని తీసుకుంటారు. తక్కువగా నీటిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన రుతుక్రమ సమయంలో ఎటువంటి నొప్పి, బాధ కలుగకుండా ఉంటుంది.

జెలటిన్ (Gelatin)

మీరు సహజంగా రుతుక్రమాన్ని దూరం చేయాలి అని అనుకుంటే అది జెలటిన్ వలన సాధ్యం అవుతుంది. జెలటిన్ మీ ఇంట్లో ఉంటే సరే లేకుంటే మీకు కిరాణా షాప్లో లభిస్తుంది. జెలటిన్ ప్యాకెట్ మొత్తాన్ని వేడి నీటిలో వేసి తీసుకోవడం వలన రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. ఇలా మీరు రోజుకి 3 సార్లు చేయడం వలన రుతుక్రమం వాయిదా వేయవచ్చు.

తక్కువ వేడి ఆహారాన్ని తీసుకోవడం

మహిళలు ఎవరైతే రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటున్నారో వారు వారి ఆహార నియమాలపట్ల నియంత్రణ వహించాలి. వేడిగా మరియు కారంగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన రుతుక్రమం తొందరగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. మీరు రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటే చల్లని ఆహరం తీసుకోవడం మంచిది. మీకు వేడిగా తినే అలవాటు ఉంటే ఆ అలవాటును మార్చుకోవడం మంచిది. చల్లని ఆహరం తీసుకోవడం వలన మీ రుతుక్రమం వాయిదా అవుతుంది.

నిమ్మకాయ

సహజంగా మీ రుతుక్రమాన్ని వాయిదా వేయడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతున్నది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆసిడ్ రుతుక్రమంలో ఎటువంటి నొప్పి, బాధ లేకుండా చేస్తుంది. ఇది మీ రుతుక్రమాన్ని వాయిదా వేస్తుంది. మీరు నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. గ్లాస్ నీటిలో నిమ్మరసం వేసి త్రాగటం చాల మంచిది. రుతుక్రమ సమయంలో మాత్రం నిమ్మరసాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే ఆ టైంలో తీసుంటే నొప్పిని ఇంకా పెంచుతుంది. కనుక మీరు రుతుక్రమం వచ్చే ముందు రోజులలో తీసుకోవడం మంచిది.

కోరిందకాయ ఆకులు (Rasberry leaves)

రాస్బెర్రి ఆకులతో మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. రాస్బెర్రి జూస్ని వేసవికాలంలో చల్లదనం కోసం త్రాగుతూ ఉంటాము. కాని దానిలో ఇన్ని ఉత్తమమైన గుణములు ఉన్నాయి అని మీకు తెలుసా? రాస్బెర్రి ఆకులను తీసుకోవడం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రాస్బెర్రి ఆకులను తీసుకొని ఎండపెట్టి టీ చేసుకొని త్రాగటం వలన మీరు రుతుక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు.

ఎంగెలిక వేరు (Angelica root)

ఎంగెలిక వేరును మీరు ఒక సాధారణ మూలిక అని అనుకోవచ్చు. కాని దీనిలో అనేక ఔషధ గుణములు ఉన్నవి. కోరిందకాయ ఆకులు మరియు ఎంగెలిక వేరు రెండింటిని కలిపి నీటిలో బోయిల్ చేయాలి. తరువాత ఆ నీటిని చల్ల పరచుటకు ఫ్రీజర్లో ఉంచాలి. రూమ్ టెంపరేచర్లోకి తీసుకువచ్చిన తరువాత రోజుకి 2 స్పూనులు తీసుకోవాలి.

గర్భాశయం దగ్గర మసాజ్ చేయుట

ఇంట్లో మీరు ఏమి చేయకుండానే రుతుక్రమాన్ని వాయిదా  వేయవచ్చు. అది మీ గర్భాశయం దగ్గర మసాజ్ చేయుట వలన సాధ్య పడుతుంది. ఇలా చేయడం వలన రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. దీనిని ఈ రోజు నుంచే మొదలుపెట్టి ఫలితాన్ని చూడండి.

బొప్పాయి

బొప్పాయి మనకు చాల సులువుగా లభిస్తుంది. ఎక్కువగా గర్భవతి స్త్రీలు దీనిని తినకూడదు అంటారు. మీకు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అంటే బొప్పాయి చాల బాగా పని చేస్తుంది. బొప్పాయిలో ఉండే కేరాటిన్ ఎస్త్రోజేన్ని ఉత్తేజ పరిచి రుతుక్రమ తేదీలు మారేటట్లు చేస్తుంది.

క్యారెట్

మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటే క్యారెట్ని మీ రోజు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. రోజు మీ వంటకాలలో క్యారెట్ ఉండేలా చూడండి. లేకుంటే పచ్చి క్యారెట్ని కూడా తినవచ్చు. లేకుంటే క్యారెట్ జూస్ త్రాగటం వలన కూడా రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com