మెయింటెనెన్స్ నిమిత్తం ముంబై ఎయిర్ పోర్టు మూసివేత...
- October 30, 2016
దేశ వాణిజ్య రాజధానిలోని విమానాశ్రయం నుంచి టికెట్ నుంచి బుక్ చేసుకున్నారా, ఈ రోజు ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారా.. అయితే మీ ప్రయాణం ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే సోమవారం మధ్యాహ్నం నుంచి 5 గంటల పాటు విమానాశ్రయం మూసివేయనున్నారు. రన్ వే మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని విమానయాన సంస్థలు, పైలట్లకు ముందుగానే తెలిపారు. ఈ షెడ్యూల్ కు అనుగుణంగా విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోరారు.
మూసివేత ప్రభావం సాయంత్రం విమాన రాకపోకలపై పడనుంది. ముంబై విమానాశ్రయం నుంచి 1600పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇందులో ఎక్కువ దేశీయ సర్వీసులు. అయితే అక్టోబర్ 18న మొదలైన నిర్వహణ పనులు నవంబర్ చివరి వారంలో ముగుస్తాయని ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. ఈరోజు రన్ వే మూసివేస్తున్నందున విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







