ట్రూజెట్‌ సంస్థ శబరిమల యాత్రికులకు ఆఫర్...

- October 30, 2016 , by Maagulf
ట్రూజెట్‌ సంస్థ శబరిమల యాత్రికులకు ఆఫర్...

 హైదరాబాద్‌ నుంచి కొచ్చికి విమానం నడపనున్నట్లు టర్బో మెగా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన ట్రూజెట్‌ సంస్థ వెల్లడించింది. నవంబరు 20నుంచి వచ్చే సంవత్సరం జనవరి 18 వరకూ ఈ విమానాన్ని నడపనున్నట్లు సంస్థ ఎండీ వంకాయలపతి ఉమేష్‌ తెలిపారు. ప్రత్యేకంగా శబరిమల తీర్థయాత్రికులు, అయ్యప్ప భక్తుల కోసం ఈ విమానాన్ని నడపనున్నట్లు ఆయన చెప్పారు. కొచ్చి శబరిమలకు 190 కిలోమీటర్లు దూరంలో ఉన్న కొచ్చి విమానాశ్రయం నుంచి పంబాకు బస్సు సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com