ఖతార్ లో 55 కొత్త పబ్లిక్ పార్కులు!

- August 24, 2015 , by Maagulf
ఖతార్ లో  55 కొత్త పబ్లిక్ పార్కులు!

ఖతార్ పురపాలక మరియు పట్టణ ప్రణాళికా శాఖ వారియొక్క పబ్లిక్ గార్డెన్స్ డిపర్టుమెంట్ వారు ప్రజల అవసరాల మేరకు  దేశవ్యాప్తంగా 55 కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు ఆ శాఖ డైరక్టర్ మొహమ్మద్ అలీ అల్-ఖూరి ప్రకటించారు. ఈ శాఖ వారు ప్రస్తుతమున్న పార్కులను నిరంతరం అందంగా మలచతున్నారని, అనేక సేవలను కూడా కల్పిస్తున్నారని అన్నారు. గత సంవత్సరంలో 15 కొత్త పబ్లిక్ పార్కులను ప్రారంభించామని, మరో రెండు పార్కులను కొద్ది నెలలలో ఉమ్మ్ సలాల్ మరియు అల్ వక్రా లో ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కులలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఇక్త్ కతార్ వారితో కలసి కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమ శాఖ మరియు పబ్లిక్ వర్క్స్ ఆధారిటీ, ఇంకా ఇతర శాఖల మధ్య సహకారాన్ని ఆయన కొనియాడారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com