ఆది పినిశెట్టి తో ఎమ్మెస్ నారాయణ కూతురు

- October 31, 2016 , by Maagulf
ఆది పినిశెట్టి తో ఎమ్మెస్ నారాయణ కూతురు

'సాహెబా సుబ్రమణ్యం' సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యింది ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కూతురు శశికిరణ్. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినప్పటికి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో కొంత విరామం తీసుకొని కొత్త స్రిప్ట్ తో ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో 'సరైనోడు' చిత్రంలో విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com