దుబాయ్‌లో బెస్ట్‌ క్యాబ్‌ డ్రైవర్‌ ఈ లాయర్‌

- November 02, 2016 , by Maagulf
దుబాయ్‌లో బెస్ట్‌ క్యాబ్‌ డ్రైవర్‌ ఈ లాయర్‌

పాకిస్తానీ లాయర్‌ ఒకరు ట్యాక్సీడ్రైవర్‌గా మారి, బెస్ట్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా అవార్డును అందుకున్నారు. దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) మంగళవారం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. 39 ఏళ్ళ ముంతాజిర్‌ హుస్సేన్‌, పాకిస్తాన్‌లోని సింధ్‌ హైకోర్టులో ఐదేళ్ళపాటు 'లా' ప్రాక్టీస్‌ చేశారు. అయితే 2008లో అనుకోకుండా ఆయన ట్యాక్సీ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. ఆర్‌టిఎ ఇటీవల బెస్ట్‌ ట్యాక్సీ డ్రైవర్లను ఎంపిక చేయగా, అందులో హుస్సేన్‌కి కూడా చోటు దక్కింది. ఆర్‌టిఎకి చెందిన దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ (డిటిసి)లో హుస్సేన్‌ పనిచేస్తున్నారు. తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ ఆయన ఎలాంటి యాక్సిడెంట్‌ చేయలేదు. స్వతహాగా లాయర్‌ని కావడంతో, నిబంధనల్ని జాగ్రత్తగా పాటించడం వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని చెప్పారు హుస్సేన్‌. 50 మంది బెస్ట్‌ క్యాబ్‌ డ్రైవర్స్‌లో ఒకే ఒక్క మహిళగా మెలనీ మంగులాబ్నన్‌ ఎంపికయ్యారు. 39 ఏళ్ళ మెలనీ గడచిన మూడేళ్ళలో యాక్సిడెంట్‌ చేయకుండా, ఎలాంటి జరీమానాలకూ లోనుకాకుండా డ్రైవ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com