మామిడల్లం మురబ్బా

- November 02, 2016 , by Maagulf
మామిడల్లం మురబ్బా

కావలసిన పదార్థాలు: మామిడల్లం - 150 గ్రా., పంచదార - ఒకటింబావు కప్పులు, మైదా - 3 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు.

తయారుచేసే విధానం: తొక్కతీసి శుభ్రం చేసిన మామిడల్లం ముక్కలుగా తరిగి అరకప్పు నీటిని జతచేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత జాలిలో వేసి నీరంతా ఒక గిన్నెలోకి వడకట్టాలి. మిగిలిన గుజ్జులో పావుకప్పు నీరు పోసి మరోసారి రుబ్బి వడకట్టాలి. కడాయిలో వడకట్టిన నీరు, పంచదార, యాలకుల పొడి వేసి చిన్నమంటపై వేడి చేయాలి. తీగపాకం రాగానే మైదా కలపాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి రాసిన పళ్లెంలో పోసి ఆరిన తర్వాత కత్తితో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా చేసుకుని సీసాలో వేసుకోవాలి. తీపిగా, కారంగా ఉండే మామిడల్లం మురబ్బా పరగడుపున తింటే పైత్యానికి మంచిదంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com