మహేష్‌బాబు నూతన చిత్ర చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో..

- November 03, 2016 , by Maagulf
మహేష్‌బాబు నూతన చిత్ర చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో..

మహేష్‌బాబు నూతన చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ ఇంతవరకు 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో జరుపుతున్న చిత్రీకరణ ఈ నెల 14 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. ఇందులో ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా మహేష్‌ నటిస్తున్నారు.కెరీర్‌ పరంగా ఆయనకు 23వ చిత్రమిది. ఇదే వర్కింగ్‌ టైటిల్‌గా ప్రచారంలో ఉంది. అయితే కథానుసారంగా దీనికి ఓ మంచి టైటిల్‌ను నిర్ణయించేందుకు చిత్రబృందం కసరత్తు చేస్తోంది. ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధులు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్‌ సరసన ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను ఎస్‌.జె.సూర్య పోషిస్తున్నారు. హేరీస్‌జైరాజ్‌ సంగీతం, సంతోష్‌శివన్‌ ఛాయాగ్రహణం, కోలీవుడ్‌కు చెందిన అన్బు, అరసు అనే కవల సోదరులు కంపోజ్‌ చేస్తున్న ఫైట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది.ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయాలన్న లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com