ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం
- November 05, 2016
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 60వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత పెద్ద విమానాశ్రయంలో భత్రను పెంచేందుకు వీలుగా ఫుల్ బాడీ స్కానర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల నఖశిఖ పర్యంతాన్ని ఎక్స్ రే తీసేలా ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయనునున్నారు. ఈ విమానాశ్రయంలో ఆరేళ్ల క్రితమే టెర్మినల్ 3లో ఈ స్కానర్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. జర్మనీ దేశానికి చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ స్కానర్ ను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు.
ప్రయాణికులు స్నాప్ షాట్ తీసుకునేలా ఈ స్కానర్ ఎలాంటి అభ్యంతరకరమైన వస్తువు తీసుకువెళుతుంటే వెంటనే పట్టేస్తుంది. శరీర భాగాలకు ఎలాంటి హాని కలగకుండా ఈ స్కానర్ పనిచేస్తుందని సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్పారు.ఈ కొత్త స్కానర్లు ప్లాస్టిక్, ద్రవ పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ప్లాస్టిక్, మెటల్ తుపాకులు, మత్తు పదార్థాలు, సిరామిక్, మెటల్ కత్తులు, బాక్సు కట్టర్లు, రికార్డింగ్ చేసే పరికరాలను కూడా ఇట్టే గుర్తిస్తాయట. ఈ ఏడాది చివరికల్లా ఢిల్లీ విమానాశ్రయంలో ఫుల్ బాడీ స్కానర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







