గుజరాత్‌కి చెందిన మరో వజ్రాల వ్యాపారి మంచి మనసు ...
- November 05, 2016
ఇటీవల గుజరాత్‌కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు దీపావళి బోనస్‌గా అందించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో డైమండ్ వ్యాపారి అతని సంస్థలో ఉండే 300 మంది ఉద్యోగులను కుటుంబాలతో సహా అంటే దాదాపు 1,200 మందిని 10రోజుల పాటు ఉత్తరాఖండ్ విహారయాత్రకు తీసుకెళ్లారు.గోవింద్ ఢోలకియా సూరత్, ముంబయిలలో శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో డైమండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.ఇటీవల ఆయన సంస్థలోని ఉద్యోగులందరికీ 10 రోజులు సెలవులు ప్రకటించారు. రూ.90లక్షలు పెట్టి ప్రత్యేకంగా ఏసీ ట్రైన్ బుక్ చేసి మరీ వారినీ విహార యాత్రకు తీసుకెళ్లారు.సంస్థకు చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ సంస్థ తరపున ఏటా ఇలాంటి యాత్రలుంటాయయని తెలిపారు. ఢోలకియా సంస్థలోని ఉద్యోగులందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారని, వారితో కలిసి ప్రయాణిస్తారని తెలిపారు. ఈ యాత్రలో వారు వివిధ ప్రాంతాలను చూడటమే కాకుండా.. సామాజిక సేవలో కూడా పాల్గొంటారని తెలిపారు. గురువారం రిషికేశ్‌లోని స్వర్గాశ్రమ ప్రాంతాన్ని అక్కడి నగర పంచాయతీ సభ్యులతో కలిసి శుభ్రపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోవింద్ ఢోలకియాను కలవాలనుకున్న మీడియా ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు తన గురించి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని ఒక ఉద్యోగి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







