12 జపనీస్ యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యడానికి భారత్ సిద్దం...
- November 05, 2016
నీటిలో, భూమి మీద ఎలాంటి సమస్యలు లేకుండా ల్యాండ్ అయ్యే 12 జపనీస్ యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యడానికి భారత్ దాదాపు సిద్దం అయ్యింది. నవంబర్ 11,12 తేదిల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ లో పర్యటించనున్న సందర్బంలో యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యాలని నిర్ణయించారు.యూఎస్ -2ఐ విమానాలు కొనుగోలు చెయ్యాలని భారత్ కొత్తగా ఆలోచించిన విషయం కాదు. 2013లోనే భారత్ యూఎస్-22ఐ విమానాలు కొనుగోలు చెయ్యాలని భావించింది. అందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి ఉండటంతో భారత్ కొద్దిగా వెనుకడుగు వేసింది.అయితే జపాన్ కొంత మొత్తం తగ్గించి విమానాలు ఇస్తామని చెప్పడంతో ఎట్టకేలకు భారత్ యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యడానికి అంగీకరించింది.ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ లో పర్యటిస్తుండటంతో దౌత్య సంబంధాలు మరింత బలోపేతం చెయ్యాలని నిర్ణయించారు.యూఎస్-2ఐ విమానాలు కొనుగోలుతో పాటు ఈ పర్యటనలో న్యూక్లియర్ టెక్నాలజీ ఒప్పందాలపై కీలక నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం. యూఎస్-2ఐ విమాను కొనుగోలు చేసిన తరువాత ఆరు విమానాలు నేవీ, కోస్టు గార్డులు వినియోగించనున్నారని సమాచారం. జపాన్ తో ఎంఓయూ కుదుర్చుకోవడంపై డిఫెన్స్ అక్విసైషన్స్ కౌన్సిల్ (డీఎసీ) సోమవారం చర్చించనుంది.నాలుగు పెద్ద టర్బో ప్రొపెలర్లు కలిగిన యూఎస్-2ఐ విమానాలు నీటి మీద, భూమి మీద తక్కువ దూరం ప్రయాణించి వెంటనే టేకాఫ్ కాగలవు. అత్యవసర సమయాల్లో దాదాపు 35 మంది సైనికులను ఒకే సారి ఈ విమానాల్లో ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి అవకాశం ఉంది.రక్షణ చర్యల్లో భాగంగా భారత్ జపాన్ నుంచి ఈ అత్యాధునిక యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చేస్తోంది. రక్షణ చర్యలో భాగంగా జపాన్ ఈ అత్యాధునికి యూఎస్-2ఐ విమానాలు తయారు చేసింది.ప్రస్తుతం నేవీకి సబ్ మెరైన్ల నుంచి మల్టీ రోల్ హెలికాప్టర్ల వరకూ అవసరం ఉండటంతో యూఎస్-2ఐ విమానాల చేరిక ఆసియా-పసిఫిక్ లో బలం చేకూరే అవకాశం ఉందని రక్షణ శాఖ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







