చెడు శ్వాసను అందించే ఆహారాలు మరియు ద్రావణాలు

- November 06, 2016 , by Maagulf
చెడు శ్వాసను అందించే ఆహారాలు మరియు ద్రావణాలు

చెడు శ్వాస
చెడు శ్వాస లేదా చెడు వాసనను, ఆహార పదార్థాలు కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని రకాల ఆహర పదార్థాలు నోటిలో బ్యాక్టీరియా జీవనాన్ని సౌకర్యవంతంగా చేస్తాయి. వీటిలో ముఖ్యంగా, సల్ఫర్ మూలక ఆహారాలు అని చెప్పవచ్చు. వీటి వలన నోటి నుండి దుర్వాసన వెలువడుతుంది. కావున, రోజులో రెండు సార్లు పళ్ళు తోమండి. అంతేకాకుండా, ఆహార పదార్థాల స్వీకరణ లేదా భోజనం తరువాత నీటితో నోటిని శుభ్రపరచటం మరవకండి. దుర్వాసనను వెలువరిచే ఆహర పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
కాఫీ
ప్రపంచ వ్యాప్తంగా కాఫీ, చాలా మందికి ఇష్టమైన ద్రావణంగా చెప్పవచ్చు. దీని వలన శక్తి తిరిగి పొందటమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గించి వేస్తుంది. కాఫీ నుండి అద్భుతమైన వాసన వెలువడుతుంది. కానీ, నోటిలోకి వెళ్ళగానే వాసన మారిపోతుంది. కాఫీ మరియు సహజ ఎంజైమ్'లను కలిగి ఉన్న లాలాజలంతో, పొట్టలో ఉన్న ఆమ్లాలతో మిలితం చెంది, వివిధ రకాల వాసనలను వెలువరుస్తుంది, ఫలితంగా నోటి నుండి దుర్వాసన వస్తుంది.
చూయింగ్ గమ్స్, చాక్లెట్
చాలా రకాల ఆహార పదార్థాలు చక్కెరలను కలిగి ఉంటాయి, ముఖ్యంగా చాక్లెట్, చూయింగ్ గమ్స్'లు కూడా అధికంగా చక్కెరలను కలిగి ఉండి, చెడు వాసనను వెలువరుస్తాయి. కారణం- చక్కెరలు, బ్యాక్టీరియా పెరుగుదలకు ఇంధనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, చక్కెర పదార్థాలు సల్ఫర్ సంబంధిత పదార్థాలను కలిగి ఉండి, చెడు వాసనను కలుగ చేస్తాయి. కావున ఇలాంటి ఆహార పదార్థాలను తిన్న తరువాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి
సాస్, ఊరగాయలు
సాస్ మాత్రమే కాకుండా, ఉరగాయలు కూడా వాసనను వెలువరుస్తాయి. ఆమ్ల గడతలు అధికంగా ఉన్న ఆహారాలు, ద్రావణాలు కూడా చెడు శ్వాసను అందిస్తాయి. ఆమ్ల గాడతలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు బ్యాక్టీరియా పెరుగుదలను రెట్టింపు చేస్తాయి. చాక్లెట్, కొవ్వు గల మాంస ఉత్పత్తులు, సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసాలు, ఆలివ్ ఆయిల్, వెన్న, టమాట రసం వంటి ద్రావణాలు లేదా ఆమ్ల గాడతలు అధికంగా ఉన్న వాటి వలన వాసనను వచ్చే అవకాశం ఉంది.
పాల ఉత్పత్తులు
ఎక్కువ ప్రోటీన్, ఉదాహరణకు పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులు దుర్గంధ మూళాలులగా చెప్పవచ్చు. ఇవి మాత్రమె కాకుండా ప్రోటీన్ అధికంగా కలిగి ఉన్న గుడ్లు, విత్తనాలు, గింజలు, బీన్స్ మరియు పప్పులు దినుసులు కూడా చెడు లేదా దుర్వాసనను వెలువరుస్తాయి. చెడు వాసనను వెలువరిచే సల్ఫర్ పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి, పాలు మరియు పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో లాక్టోజ్'లను కలిగి ఉండటం వలన వాసనను వెలువరుస్తాయి.
ఆల్కహాల్
నోటిని ఎండబెట్టే కారకాలు ఎల్లపుడు చెడు శ్వాసను ఉత్పత్తి చేస్తాయి. ఆల్కహాల్ సంబంధిత ద్రావణాలు, వైన్, విస్కీ వంటివి బ్యాక్టీరియాలను ఉత్పత్తి చెందించి, వాసనను కలుగ చేస్తాయి, అంతేకాకుండా, అమ్మోనియా నుండి సల్ఫర్ మూలకాలను ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఈ ద్రావణాలు మెదడు మరియు శరీర వివిధ భాగాల నుండి మాత్రమె కాకుండా నోటి నుండి కూడా నీటిని గ్రహిస్తాయి. ఫలితంగా, లాలాజలం ఉత్పత్తి తగ్గి, నోటి నుండి దుర్వాసన కలుగ చేస్తుంది.
ట్యూనా సాండ్ విచ్
ట్యూనా సాండ్ విచ్, కూడా నోటి నుండి చెడు వాసనను వెలువరుస్తుంది. సాధారణంగా, ఆహరం నోటి నుండే జీర్ణమవటం ప్రారంభం అవుతుంది, కావున, ట్యూనా సాండ్ విచ్ ప్రారంభం నుండే దుర్వాసనను వెదజల్లుతుంది. ట్యూనా సాండ్ విచ్'కు ఆలివ్ ఆయిల్ కలపటం వలన దుర్వాసన తక్కువగా వెలువడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com