రవి కే. చంద్రన్‌ మహేష్ చిత్రానికి ఫోటోగ్రాఫర్...!

- November 07, 2016 , by Maagulf
రవి కే. చంద్రన్‌  మహేష్ చిత్రానికి ఫోటోగ్రాఫర్...!

మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ చిత్రాల హిట్స్ తో కొరటాల శివ మార్కెట్ బాగా పెరిగిపోయింది..ఇతని తో సినిమాలు చేయడానికి బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 9 న ఈ చిత్ర ప్రారంభం కానుంది..ఇక ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ వర్క్చేయనున్నాడట..బాలీవుడ్‌లో గజిని, సావరియా, మై నేమ్ ఈజ్ ఖాన్, తెలుగులో 7th సెన్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమా ఫోటోగ్రఫీ చేసిన రవి కే. చంద్రన్‌ పనిచేయనున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్ చిత్రానికి కూడా స్టార్ సినిమాటోగ్రాఫర్ తీరు ను తీసుకున్న సంగతి తెల్సిందే.డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
ఇక మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వం లో మహేష్ 23 (వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నాడు. తెలుగు , తమిళ భాషలలో ఈ మూవీ తెరకెక్కడం జరుగుతుంది. మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా , హరీష్ జైరాజ్ సంగీతం అందించడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com