బన్నీతో మూవీ డైరెక్ట్ చేయాలని తన డ్రీమ్‌గా పెట్టుకున్నాహరీష్ శంకర్..
- November 07, 2016
'సరైనోడు' సూపర్ హిట్ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ 'డీజే..దువ్వాడ జగన్నాథం'. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. 'గబ్బర్ సింగ్'తో పవన్ కళ్యాణ్ రేంజ్‌కి తగ్గ పవర్ఫుల్ హిట్ ఇచ్చాడు హరీష్. ఇప్పుడు బన్నీతో చేస్తున్న 'డీజే' మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు. బన్నీతో మూవీ తీయాలని పన్నెండేళ్ల నుండి కల కంటున్నాడట.'ఆర్య' మూవీలో బన్నీ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిపోయాడట హరీష్. ఆ మూవీలో బన్నీ డాన్స్.. యాక్టింగ్ స్కిల్స్‌కి ఫిదా అయ్యాడట. అందుకే.. అప్పుడే బన్నీతో మూవీ డైరెక్ట్ చేయాలని తన డ్రీమ్‌గా పెట్టుకున్నాడట.అప్పటి తన కల ఇప్పుడు దిల్ రాజు ఇచ్చిన అవకాశంతో 'డీజే..దువ్వాడ జగన్నాథం' డైరెక్టర్‌గా తీరుతుందని అంటున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న 'డీజే' మూవీలో పూజా హెగ్డేతో ఫస్ట్ టైం జతకడుతున్నాడు బన్నీ.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









