యూఏఈ ట్రాఫిక్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ని ఆకర్షించిన న్యూ స్పీడ్‌ కెమెరా

- November 07, 2016 , by Maagulf
యూఏఈ ట్రాఫిక్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ని ఆకర్షించిన న్యూ స్పీడ్‌ కెమెరా

అబుదాబీ: పోర్టబుల్‌ స్పీడ్‌ కెమెరాలు, భవిష్యత్తులో యూఏఈ మోటరిస్టులకు షాక్‌ ఇవ్వనున్నాయి. పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ కెమెరాలను త్వరలో యూఏఈలో అమర్చనున్నారు. ఫ్రెంచ్‌ ఇంటీరియర్‌ మినిస్ట్రీ 250 కొత్త స్పీడ్‌ కెమెరా యూనిట్లను 2018 చివరినాటికి తమ రోడ్లపై ఇన్‌స్టాల్‌ చేయనుంది. జర్మనీ, లగ్జెంబర్గ్‌ మరియు స్పెయిన్‌ కూడా ఈ డివైజెస్‌ని పరీక్షించింది. గత నెలలో జరిగిన ఎక్స్‌పోలో ఈ న్యూ స్పీడ్‌ కెమెరా గురించి యూఏఈ ఫెడరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల్ని, హార్డ్‌ షోల్డర్‌ డ్రైవింగ్‌ చేసేవాటినీ, అలాగే షడెన్‌ లేన్‌ ఛేంజ్‌ వెహికిల్స్‌నీ ఈ న్యూ స్పీడ్‌ కెమెరా కనిపెట్టేస్తుంది. తక్షణం సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్‌కి అందించడం ఈ కెమెరాల ప్రత్యేకత. ఎలాంటి ఛార్జింగ్‌ అవసరం లేకుండా ఏకధాటిగా ఐదు గంటల పాటు పనిచేయడం ఈ కొత్త కెమెరా వ్యవస్థ (రాడార్‌) ప్రత్యేకతగా మేకర్స్‌ వివరిస్తున్నారు. అబుదాబీ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో గత నెలలో జర్మన్‌ కంపెనీ విట్రానిక్‌, ఫ్రెంచ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థ కోజెలెక్‌ ఈ వ్యవస్థను ప్రదర్శించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com